CM KCR: రాజకీయ బిచ్చగాళ్ల మాయమాటలను ప్రజలెవరూ నమ్మొద్దు..!

స్వతంత్ర  వెబ్ డెస్క్: సూర్యాపేట(Suryapeta) ప్రగతి నివేదన సభలో ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని, ప్రజలెవరూ నమ్మొద్దని  ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్(CM KCR) నిప్పులు చెరిగారు . సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ఎన్నికలు రాబోతున్న సందర్భంగా బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీ వాళ్లు తమకు ఒక అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, కాంగ్రెస్ కు 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు మంత్రులుగా పని చేశారని, సూర్యాపేటను వాళ్లు ఏనాడైనా అభివృద్ధి చేశారా..? అని ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్‌ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా..? సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి..? అని అడిగారు.

కాంగ్రెస్ నేతలు రైతుల కష్టాలు తీర్చాలని ఏనాడైనా ఆలోచించారా..? అని అడిగారు. రూ.4 వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రానికో నీతి ఉంటుందా..? అని అన్నారు. తాము కూడా పింఛన్లు తప్పకుండా పెంచుతామన్నారు. పింఛన్లు ఎంతకు పెంచుతామన్న విషయాన్ని త్వరలోనే చెబుతామన్నారు.

ఒక పార్టీ నాయకుడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడని, మరో పార్టీ నాయకుడేమో 3 గంటల కరెంటు చాలంటాడని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌ గెలిచిన కర్ణాటకలో అప్పుడే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని చెప్పారు. కర్నాటకలోని చాలా గ్రామాల్లో, బెంగళూరు సిటీలోనూ కరెంటు కోతలు విధిస్తున్నారని చెప్పారు. కేవలం 7 గంటలే కరెంటు ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం పడ్డ బాధలే ఇప్పుడు కర్నాటక వాళ్లు పడుతున్నారని చెప్పారు. గతంలో మాదిరిగా వ్యవసాయ పొలాలు, బావుల వద్ద పాములు, తేళ్లు కరిచి చచ్చిపోయే పరిస్థితులు మనకు రావాల్నా..? 24 గంటల కరెంటు ఇలాగే ఉండాలో ఆలోచించుకోండి అని అన్నారు.

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్