మోడీ ముఖం చూస్తే ప్రజలు భయపడుతున్నారు: గొంగిడి సునీత

స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ.. మోడీ ముఖంలో ఏముంది. ఆయన మొహం చూస్తే ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఆకలి కడుపులతో ఉన్న ప్రజలను చూస్తే బీజేపీ నేతలకు మంచి నిద్ర వస్తుందని విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశానికి 10 మంది సీఎంలు హాజరు కాలేదు.. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి తెలుసు కోవాలని అన్నారు.

మేము అక్కడికి వచ్చి మీతో నేర్చుకునేది ఏమి లేదు.. ఇక్కడికి వస్తే ఒరిగేది ఏమి లేదు. ప్రజల అవసరాలు తీర్చడమే మా బాధ్యత అంటూ విరుచుకుపడ్డారు. సీఎం కెసిఆర్ గురించి మాట్లాడేటపుడు ఆలోచించి బీజేపీ నేతలు మాట్లాడాలని అన్నారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ప్రత్యేకంగా ఏమి తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేంద్రం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చెసిందో బీజేపీ నేతలు చెప్పగలరా? అంటూ అని ప్రశ్నించారు.

కెసిఆర్ పై నమ్మకంతో ఎంతో మంది నేతలు తమతో కలిసేందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రధాని మోడీ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామనడం బీజేపీ నేతలు అనడం విడ్డురమని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని.. బీజేపీ పాలనలో ధరలు, మతోన్మాదం బాగా పెరిగాయని అన్నారు. హామీలు నెరవేర్చుకునే పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి లేదఅన్నారు. బీజేపీ హయాంలో దేశంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్