స్వతంత్ర, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి సీనియర్ కార్యకర్త అని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వివాదంపై మంత్రి స్పందిస్తూ.. చంద్రబాబు పల్లకి మోసేందుకు పవన్ ఉన్నాడని.. పవన్ చేద్దామనుకున్న పని గురించే ఫ్లెక్సీలో చెప్పామని అన్నారు. టీడీపీకి మాకు సంబంధం లేదంటే 175 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఏ మేనిఫెస్టో తెచ్చినా ప్రజలు నమ్మరని.. గతంలో ఎప్పుడైనా మేనిఫెస్టోను చంద్రబాబు అమలు చేశారా?అని మంత్రి ఎద్దేవా చేశారు.