25.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

‘ఫైటర్’ నుంచి పార్టీ సాంగ్ వచ్చేసింది!

హృతిక్ రోషన్, దీపికా పదుకొనె జంటగా సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా మూవీ ‘ఫైటర్’. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగించిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 2024 జనవరి 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఫైటర్ మూవీ నుండి “షేర్ కుల్ గయ” అంటూ సాగే పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు. హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన “బ్యాంగ్ బ్యాంగ్” , “వార్” సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్