లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్‌

  భారత్ తో 1999లో చేసుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కార్గిల్ యుద్ధానికి అప్పటి జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణమని పరోక్షంగా పేర్కొన్నారు. పాక్ తొలి అణు ప్రయోగం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ 1999 నాటి లాహోర్ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది.

  1998 మే 28న పాకిస్థాన్ ఐదు అణుపరీక్షలను నిర్వహించిందన్నారు. ఆ తర్వాత వాజ్‌పేయి ఇక్కడి కొచ్చి తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది తమ తప్పేనని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. లాహోర్ వేదికగా భారత్, పాక్ మధ్య 1999లో కుదిరిన శాంతి ఒప్పందాన్ని లాహోర్ డిక్లరేషన్ అని అంటారు. ఇందులో భాగంగా ఇరు దేశాలు. శాంతి నెలకొల్పాలని, ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించాలని నిర్ణయించారు. ఆ తరువాత కొద్ది నెలలకే నవాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్‌లో కార్గిల్ జిల్లాలో చొరబాట్లకు తెరతీశారు. ఫలితంగా జరిగిన యుద్ధంలో పాక్ ఓడి పోయింది. అణు పరీక్షలు నిర్వహించకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ కు 5 బిలియన్ల ఆర్థిక సాయం ఇస్తానని ఆశ చూపినట్టు నవాజ్ షరీఫ్ అన్నారు. కానీ ఆ ఆఫర్ ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. తన స్థానంలో ఇమ్రాన్ ఖాన్ ఉండి ఉండే బిల్ క్లింటన్ ప్రతిపాదనకు అంగీక రించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. తనను పదవి నుంచి దించేయాలని దేశ నిఘా సంస్థ ISI పన్నిన కుట్రలో భాగంగానే అప్పట్లో కేసు నమోదు చేశారని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ కు పీఎం పదవి కట్టబెట్టేం దుకు ISI ఈ కుట్రకు తెరలేపిందన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్