ఒక దేశం, ఒకే ఎన్నికలు అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నం- CM యోగి

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ పై స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధికి వేగవంతమైన పాలన అవసరమని, ఈ దృక్కోణంతో, ‘ఒక దేశం, ఒకటే ఎలక్షన్’ అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నమని అన్నారు.  “సంపన్నమైన ప్రజాస్వామ్యానికి, రాజకీయ స్థిరత్వం నిజంగా ముఖ్యమైనది. ప్రజాస్వామ్య, ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధి కోసం వేగవంతమైన పాలన అవసరం. ఈ క్రమంలో ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నం” అని చెప్పారు. ఈ విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీఎం.. “ఒకే దేశం, ఒకే ఎన్నిక” కోసం ఏర్పాటు చేసిన కమిటీ మాజీ రాష్ట్రపతి (రామ్ నాథ్ కోవింద్) అధ్యక్షతన ఏర్పడినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు.

 

“ఈ వినూత్న చొరవ కోసం, ఉత్తరప్రదేశ్ పౌరుల తరపున నేను ప్రధాని మోడీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను” అని సీఎం యోగి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనేది ఈ సమయంలో ఆవశ్యకమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రకాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావడానికి గల అవకాశాలను కమిటీ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, లా కమిషన్, నీతి అయోగ్ గతంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను పరిశీలించి, ఈ అంశంపై నివేదికలను సమర్పించాయి.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్