మరోసారి రేవంత్‌ సర్కార్‌ టార్గెట్‌ కేటీఆర్‌

GST వసూళ్లు తగ్గడంతో రేవంత్‌ సర్కార్‌పై ట్విట్టర్‌ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణలో బుల్డోజర్ రాజ్‌ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయ్ అని సెటైర్లు వేశారు. గతేడాదితో పోల్చుకుంటే తొలిసారిగా తెలంగాణలో GST వసూళ్లు 1 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. GST వసూళ్లలో తెలంగాణ ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధిని సాధించేదని.. తెలంగాణ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో విజయవంతంగా పోటీపడుతోందని పోస్ట్ చేశారు.

విధ్వంసకర విధానాలతో GST వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనూహ్యమైన ఘనతను సాధించిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్పగా ఫలితాలనిస్తోందని రాసుకొచ్చారు. తెలంగాణ వంటి సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ తిరోగమన పరిస్థితిపై సీఎం సమాధానం చెబుతారని ఆశిస్తున్నానంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్