ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కాగా, ప్రపంచంలోనే భారీ పంపులతో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలకు సిద్ధమైంది. వెట్ రన్ సందర్భంగా 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని మోటర్లు ఎత్తిపోయనున్నాయి. ప్రాజెక్ట్ వెట్ రన్ ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అదే రోజు ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఈ సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సభకు పాలమూరు- రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరయ్యేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 16వ తేదీ ప్రారంభోత్సం తర్వాత ఈనెల 17న ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు గ్రామ సర్పంచులు, ప్రజలు అభిషేకం చేయనున్నారు.

Latest Articles

నటనకు దక్కిన గౌరవం.. అనంత్‌ నాగ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

  కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్‌ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు అనంత్‌ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్