Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

డొనాల్డ్ ట్రంప్ దోషేనని తేల్చిన న్యూయార్క్ న్యాయస్థానం

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇటీవలికాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతు న్నాయి. ఈ ఏడాది నవంబరులో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసి, మరోసారి వైట్‌హౌస్‌లోకి వెళ్లాలని రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తాపత్రయపడుతున్నారు. అయితే ట్రంప్ ఈ ప్రయత్నాల్లో ఉండగా ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగి లింది. శృంగార తార స్టార్మీ డానియేల్స్‌కు సంబంధించిన కేసులో ట్రంప్‌ను దోషిగా న్యూయార్క్‌ కోర్టు నిర్థారించింది. మొత్తం 34 ఆరోపణలకు సంబంధించి ట్రంప్‌ను దోహిగా తేల్చింది న్యూయార్క్ న్యాయస్థానం. దీంతో ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

  స్టార్మీ డానియేల్స్ అమెరికాలో బాగా పాపులరైన శృంగార తార. గతంలో ఆమెతో డొనాల్డ్ ట్రంప్ ఏకాంతంగా గడిపారనే ఆరోపణలున్నాయి. అయితే 2016 అధ్యక్ష పదవి ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని బయటపెడతానని ఆమె బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఎన్నికల సమయంలో ఈ విషయం బయటపడితే, ఆ ప్రభావం పోలింగ్‌పై పడు తుందని డొనాల్డ్ ట్రంప్ భయపడ్డారు. ఈ నేపథ్యంలో సదరు శృంగార తార నోరు విప్పకుండా ఉండటానికి తన న్యాయ వాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారన్నది ట్రంప్‌ మీదున్న వచ్చిన ఆరోపణ. అయితే ఇదం తా ట్రంప్ బ్యాంక్ అకౌంట్‌లో నుంచి విత్ డ్రా చేసి ఇచ్చిన అమౌంట్ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారనీ, దీని కోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా ఒకటి కాదు..రెండు కాదు….మొత్తం 34 నేరారోపణలు నమోదయ్యాయి.

  డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన అభియోగాలన్నిటిపై ఆరు వారాల పాటు విచారణ జరిపింది న్యూయార్క్ న్యాయస్థానం. ఈ విచారణ తరువాత అభియోగాలన్నీ వాస్తవమేనని ఇటీవల 12 మంది న్యాయ మూర్తులతో కూడిన ధర్మాసనం ఇటీవల చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి స్టార్మీ డానియేల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన విషయం వాస్తవమే నని కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు ఆమె. ఈ కేసుకు సంబంధించి స్టార్మీ డానియేల్స్ సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది. న్యాయార్క్ కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ కోర్టుహాలులో మౌనంగా ఉన్నారు. ఇదిలా ఉంటే న్యూయార్క్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ దిశగా డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదుల బృందం ఇప్పటికే రంగం లోకి దిగింది. తనను దోషిగా నిర్థారిస్తూ న్యూయార్క్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ట్రంప్‌ స్పందించారు. తాను నిరపరాధినన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందని ట్రంప్ ఆరోపించారు. ఈ సందర్బంగా తీర్పు ఇచ్చిన న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తిని వివాదాస్పద వ్యక్తిగా ట్రంప్ ఆరోపించారు. న్యూయార్క్ కోర్టు తీర్పు ఎలా గున్నా, నవంబరు ఐదో తేదీన జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో అమెరికా ప్రజలు అసలైన తీర్పు ఇస్తారని ట్రంప్ పేర్కొన్నారు. దేశం కోసం, న్యాయం కోసం తాను పోరాడుతూనే ఉంటానన్నారు డొనాల్డ్ ట్రంప్.

  డొనాల్డ్ ట్రంప్‌ను దోషిగా నిర్థారిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పు చెప్పడం పై జో బైడెన్‌ – హారిస్ ప్రచార బృందం హర్షం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని డెమొక్రటిక్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇండో – అమెరికన్ నేతలు వివేక్ రామస్వామి, బాబీ జిందాల్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి ఉద్దేశాలపై వీరు సందేహాలు వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే…ఈ ఏడాది నవంబరులో జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా న్యూయార్క్‌ కోర్టు తీర్పు ఇవ్వడం అమెరికా సమాజంలో దుమారం రేపింది. అయితే న్యూయార్క్ కోర్టు తీర్పు ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలే మంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఈ సందర్బంగా అమెరికా సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పులను అమెరికా ప్రజలు పట్టిం చుకోరన్నది రిపబ్లికన్ పార్టీ వర్గాల వాదన. అయితే ఒక వివాదాస్పద రాజకీయ వేత్తను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి సగటు అమెరికన్లు అంగీకరించరన్నది ట్రంప్ వ్యతిరేక వర్గాలు అంటు న్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్