స్వతంత్ర వెబ్ డెస్క్: నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయానికి అర్చకులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మహరాష్ట్ర సీఎం షిండే, డిప్యూటి సీఎం పడ్నవీస్, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి హజరయ్యారు. తిరుమల తరహలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తూన్నామని మహరాష్ట్ర సీఎం షిండే పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్థికంగా ముందుకు వెళుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆలయానికి సమీపంలోని తీర ప్రాంతం నుంచి నిర్మిస్తోన్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి టీటీడీకి పూర్తిగా సహకరిస్తమని వెల్లడించారు. తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు…. నవీ ముంబాయిలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల విలువైన 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో రూ.100 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించనున్న సింఘానియా చెప్పారు. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.