32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

ఆదిపురుష్ డైరెక్టర్‌పై శ్రీవారి భక్తులు ఆగ్రహం.. పవిత్ర ప్రదేశంలో అలా చేస్తారా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించనంత
గ్రాండ్‌గా జరిగింది.

ప్రభాస్ నిన్న ఉదయమే తిరుమల వెళ్లి సుప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభాస్ పంచెకట్టుతో తిరుమలలో తిరిగిన ఫొటోలు, వీడియోలు నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక నేడు ఉదయం కృతి సనన్ తో పాటు ఓం రౌత్, నిర్మాత భూషణ్, మరికొంతమంది చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని అర్చన సేవలో పాల్గొన్నారు. యూనిట్ అంతా సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలను సందర్శించారు. తిరుమల ఆలయం బయట కృతి సనన్, చిత్రయూనిట్ ఫొటోలు దిగగా అవి వైరల్‌గా మారాయి.

అయితే ఈ క్రమంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. దర్శనం పూర్తి చేసుకుని కారులో వెళ్లబోతున్న కృతి సనన్ వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో.. ఆమె దగ్గరకు ఓం రౌత్ మళ్ళీ వచ్చారు. టాటా చెప్పారు. అక్కడి వరకు ఒకే. అయితే.. కృతిని హగ్ చేసుకున్న ఓం రౌత్, ఆమె చెంపపై ముద్దు (పెక్) పెట్టారు. ‘గాడ్ బ్లెస్ యూ’ (దేవుడు నిన్ను చల్లగా చూడాలి) అంటూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. స్వామి వారి భక్తులకు ఆది కోపాన్ని తెప్పిస్తోంది.

చిత్రసీమలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ టాటా బైబై చెప్పడం చాలా కామన్. సినిమా ఇండస్ట్రీ కల్చర్ అది. ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో సర్వ సాధారణం. కానీ, తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట ఇలా ముద్దు పెట్టుకోవటాలు, ఆలింగనాలు లాంటివి సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తీసిన ఓం రౌత్ ఉద్దేశపూర్వకంగా ఆ పని చేసి ఉండకపోవచ్చు. ఆయనకు భక్తి శ్రద్ధలు ఎక్కువే. అయితే, తిరుమల క్షేత్రంలో ఆ విధంగా చేయడం భక్తుల ఆగ్రహానికి గురి అవుతోంది. దీనిపై ఆయన స్పందించాలని కొందరు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… రెండు రాష్ట్రాల ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులను రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న ‘స్పిరిట్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చేలా ఒప్పందం జరిగిందట.

 

Latest Articles

షకీల్ కుమారుడు రాహిల్ కేసులో కీలక మలుపు

  మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజా భవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్‌ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్