చైనాలో కోవిడ్‌- 19 మాదిరి మరో కొత్త వైరస్‌

చైనాలో మరో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. కోవిడ్‌ 19 మహమ్మారికి కారణమైన వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదాన్ని కలిగి ఉన్న కొత్త కరోనా వైరస్‌గా గుర్తించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం, HKU5-CoV-2 అనే కొత్త వైరస్‌ను “బ్యాట్‌వుమన్” అని పిలువబడే ప్రఖ్యాత శాస్త్రవేత్త షి జెంగ్‌లీ నేతృత్వంలోని వైరాలజిస్టుల బృందం కనుగొంది. ఆమె కరోనా వైరస్‌పై వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ వుమెన్‌గా పేరుపొందారు. రు. ఈ వుహాన్‌ ప్రయోగశాల నుంచే COVID-19 వైరస్‌ లీక్‌ అయిందని ప్రచారం జరిగింది. దీన్ని చైనా ఖండించింది.

కోవిడ్ మహమ్మారికి కారణమైన వైరస్ SARS CoV-2 తో ఈ కొత్త వైరస్ సారూప్యతలను కలిగి ఉందని చైనా పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే ఇది కూడా కోవిడ్ మాదిరిగానే ACE2 అని పిలువబడే మానవ కణాలలోకి చొచ్చుకుపోగలదని నివేదికలు చెబుతున్నాయి.

HKU5-CoV-2 అంటే ఏమిటి?

HKU5-CoV-2 అనేది మెర్బెకోవైరస్ ఉపజాతికి చెందిన కరోనావైరస్, ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS)కు కారణమయ్యే వైరస్ . కొత్త వైరస్ మానవ ACE2తో చేరిపోగలదని, ఇది SARS-CoV-2, సాధారణ జలుబు వైరస్‌ అయిన NL63మాదిరిగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ల్యాబ్‌ టెస్టుల్లో , శాస్త్రవేత్తలు ఉపయోగించిన మినీ-హ్యూమన్ ఆర్గాన్ మోడల్‌లలో HKU5-CoV-2 మానవ కణ కల్చర్‌ను ఇన్‌ఫెక్ట్‌ చేస్తుందని బృందం గుర్తించింది. HKU5-CoV-2 నేరుగా లేదా మాధ్యమజీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ సామర్థ్యం కొవిడ్‌-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్