ఏందీ సామీ ఇది.. అడుక్కునే వాళ్లకు జీతం ఇస్తూ బెగ్గింగ్ దందా..!

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో(Hyderabad) అడుక్కునేవాళ్లకు ఓ ప్రబుద్ధుడు జీతం ఇస్తున్నాడు. అడుక్కుకోవడం కూడా ఒక పనిగా భావించి దాన్ని బిజినెస్ కింద మార్చుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 23 మందిని ‘ఉద్యోగం’లోకి తీసుకున్నాడు. వారికి మాంచి డిమాండ్ ఉన్న ఆయా కూడళ్లలో ‘పోస్టింగ్’ ఇచ్చి దందా నడిపిస్తున్నారు. పొద్దున పని అప్పగించడం సాయంత్రం వారు వసూలు చేసిన సొమ్మును లాక్కుని ‘జీతం’ ఇవ్వడం అతని బిజినెస్. రోజుకు రూ. 200 కూలి కింద కుంటాళ్లను, దిక్కుమొక్కులేని వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో జైల్లోకి నెట్టారు.
బిహార్‌కు చెందిన అనిల్ పవార్ అనే యువకుడు భాగ్యనగరంలో బెగ్గింగ్(Beggind Rocket) రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్(Jubli Hills) చెక్ పోస్ట్ కూడళ్లలో అతడు జీతానికి భిక్షాటన చేయిస్తున్నట్లు తేలడంతో గురువారం అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద నియమితులైన బిచ్చగాళ్ల నుంచి అనిల్ రోజూ సగటున 6 వేలు వసూలు చేస్తూ వారికి రూ. 200 కూలి ఇస్తున్నట్లు తేలింది. భిక్షాటన నిరోధక చట్టం కింద అతనిపై కేసు పెట్టారు.

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్