29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

SMART PHONES |కొత్త స్మార్ట్ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ ఉన్న ఫోన్లు ఇవే..

SMART PHONES: ప్రతి రోజు రకరకాల స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రెండ్‌ కూడా మారుతోంది. చాలా మంది ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లపైనే ఆసక్తి చూపిస్తుండటంతో.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ కంపెనీలు ఎన్నో న్యూ మోడల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ల కోసం చూస్తుంటారు. ఫోన్లు కొనేటప్పుడు ఫీచర్స్‌తో పాటు.. బ్రాండ్ కూడా ముఖ్యం. ప్రస్తుతం 20వేల రూపాయల లోపు ఎక్కువ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఫోన్ల వివరాలు

GOOGLE PIXEL 4G:  గూగుల్ పిక్సెల్ 4 ఫోన్ 20వేల రూపాయలలోపు లభిస్తుంది. అదే సమయంలో టాప్ 7 స్మార్ట్‌ఫోన్ల జాబితాలోనూ ఈ ఫోన్‌ ఉంది. దీని రేటు 19,999 రూపాయలు. ఇందులో 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.7 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ కూడా ఉంది.

ONEPLUS NORD CE 2: 20వేల రూపాయలలోపు ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. 64 ఎంపీ కెమెరా, డ్యూయెల్ వ్యూ వీడియో, హెచ్‌డీఆర్, నైట్ పోట్రేట్, పానొరమ మోడ్, రీటచ్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభం అవుతోంది.

OPPO A74 5G: ఒప్పోలో అందరికీ అందుబాటు ధరల్లో ఆకర్షణీయ ఫీచర్స్‌తో ఒప్పో ఏ 74 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 48 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో 6.49 ఇంచుల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్ వంటి ఫీచర్లు అనేకం ఉన్నాయి. దీని రేటు రూ. 15,490.

REDMI 9A SPORT:రెడ్‌మి 9ఏ స్పోర్ట్ కూడా 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తున్న టాప్ 7 అదిరే స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీని రేటు రూ. 6499. ఇందులో 32 జీబీ మెమరీ ఉంటుంది. సూపర్ సెల్పీ ఫోటోలు తీసుకోవడానికి మంచి కెమెరా కూడా ఉంది. తక్కువ ధరలో అదిరే ఫోన్ కొనాలని భావించే వారికి ఇదో మంచి ఎంపిక అవుతుంది.

REDMI 9A SPORT: రెడ్‌మి 9ఏ స్పోర్ట్ ఫోన్‌ 10వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తున్న టాప్ 7 అదిరే స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీని రేటు రూ. 6499. ఇందులో 32 జీబీ మెమరీ ఉంటుంది. సూపర్ సెల్పీ ఫోటోలు తీసుకోవడానికి మంచి కెమెరా కూడా ఉంది. తక్కువ ధరలో అదిరే ఫోన్ కొనాలని భావించే వారు దీన్ని పరిశీలించవచ్చు.

SAMSUNG GALAXY A23: సామ్సంగ్ గెలాక్సీ ఏ23 స్మార్ట్ ఫోన్ కూడా 20వేల రూపాయల లోపు లభిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ఇందులో 50 మెగాఫిక్సెల్ కెమెరా ఉంటుంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, పవర్ ఫుల్ ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర 18,499 రూపాయలు.

SAMSUNG GALAXY M13: సామ్సంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ కూడా 20 వేల రూపాయల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. వివిధ రంగుల్లో లభించే ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 12 జీబీ వరకు ర్యామ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 12పై పని చేస్తుంది. దీని ధర 11,999 రూపాయలు

SAMSUNG GALAXY M32: శాంసంగ్ గెలాక్సీ ఎం32 కూడా రూ. 20 వేల లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో ఇది కూడా ఉంది. ఇందులో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని రేటు రూ. 15,499 నుంచి ప్రారంభం అవుతోంది.

Read Also:  దేశంలో మహిళలు కూడా తెగ తాగేస్తున్నారు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్