38.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

Manchu Manoj |ఆ ఇద్దరి బాధ్యత నాదే.. ఆ విషయంలో మంచు మనోజ్ క్లారిటీ..

Manchu Manoj |సినీ నటుడు మంజు మనోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఈనెల 3వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. తమ్ముడు మనోజ్‌ పెళ్లి బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు మంచు లక్ష్మీ. ఫిల్మ్ నగర్‏లోని ఆమె స్వగృహంలో ఇరువురి కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. మంచు మనోజ్‏కు.. మౌనికలకు ఇది రెండో వివాహం అనే విషయం తెలిసిందే. ఇదే సమయంలో మౌనికకు ధైరవ్ రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి వేడుకలలో ధైరవ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక పెళ్లి తర్వాత మనోజ్ చేసిన ఆసక్తికర ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో మౌనిక చేతులను తన చేతులోకి తీసుకున్నారు మనోజ్. వీరిద్దరి చేతులను ధైరవ్ తన చేతులతో పట్టుకున్నాడు. ఈ అందమైన ఫోటో షేర్ చేస్తూ.. శివుని ఆజ్ఞ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మనోజ్. ఇక వీరిద్దరి బాధ్యత తనదనే అర్థం వచ్చేలా ఆ పోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తన పెళ్లి గురించి మనోజ్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. అలాగే మంచు మనోజ్ మ్యారెజ్ గురించి మంచు కుటుంబసభ్యులు ముందుగా స్పందించలేదు. మార్చి 3న పెళ్లి రోజున మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ క్యాప్షన్ ఇస్తూ మౌనిక ఫోటో షేర్ చేశారు మనోజ్.

Read Also:  వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌.. ఆ కీలక నేతకు మరోసారి సీబీఐ నోటీసులు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మంత్రులకు సీఎం రేవంత్ టార్గెట్ గా మారారా?

    సీఎంకు మంత్రుల‌కు మధ్య దూరం పెరిగిందా? ముఖ్యమంత్రిపై విప‌క్షాలు మాట‌ల దాడులు చేస్తున్నా మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తాము స్పందిస్తే సీఎంకి మైలేజ్ వస్తోందని మంత్రులు భావిస్తున్నారా?...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్