2 వేల కిలోమీటర్లు మైలురాయిని చేరుకున్న యువగళం పాదయాత్ర

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎన్.అమర్ నాథ్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి ఇన్ ఛార్జి సుబ్బానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, మీనాక్షినాయుడు తదితరులు లోకేశ్ ను కలిసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. “కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న నా పాదయాత్ర ఈరోజు కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టం. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించాను” అని తెలిపారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్