దేశ సంపన్నుల్లో మళ్లీ ముకేశ్‌ అంబానీదే అగ్రస్థానం


    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్‌ టాప్‌–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్‌ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్‌ టాప్‌ 9గా నిలిచారు. 2023లో ముకేశ్‌ సంపద 83.4 బిలియన్‌ డాలర్లు గా నమోదైంది.

   దేశీయంగా సంపదలో టాప్‌–2గా నిలుస్తున్న గౌతమ్‌ అదానీ 84 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్‌ డాలర్లకు క్షీణించింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యం లో అదానీ గ్రూప్‌ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించారు.

    ఫోర్బ్స్‌ 2024 బిలియనీర్ల జాబితాలో 2వేల 781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్‌ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్‌ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్‌ దిగ్గజం LVMHకు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 233 బిలియన్‌ డాలర్లతో టాప్‌ ర్యాంకును, 195 బిలియన్‌ డాలర్లతో ఎలన్‌ మస్క్‌ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్‌ డాలర్లతో ఫేస్‌బుక్‌ జుకర్‌బర్గ్‌ మూడో స్థానంలో నిలిచారు.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్