రాజకీయ కక్ష సాధింపులపై సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపులు చేయడం సరైన పద్ధతి కాదని లేఖలో పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేది గ్రహించాలని సూచించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్, తాను 1978లో ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని… నాడు ఇలా అధికారంలో ఉండి ప్రతిపక్షాలపై కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. నేడు అధికారంలోకి వచ్చిన మీరు… మీ కుమారుడితో కేసులు పెట్టిస్తున్నారని ముద్రగడ ఆక్షేపించారు.