21.7 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనున్నట్లు L&T మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. అయితే ఆ కోచ్‌లు పట్టాలపైకి పరుగులు పెట్టేందుకు చాలా సమయం పడుతుందన్నారు. అప్పటిలోగా ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఇంతకీ కొత్త కోచ్‌లు ఎప్పుడు వస్తాయి..?మరో రెండేళ్ల పాటు ఇదే రద్దీతో అడ్జెస్ట్ కావాల్సిందేనా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2017లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ఏడేళ్లు పూర్తి చేసుకుంది హైదరాబాద్ మెట్రో. దీని ద్వారా ప్రతిరోజు 5 లక్షల మంది వరకు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. మూడు కారిడార్లలో 57 రైళ్లు ప్రతిరోజు 1100 ట్రిప్పులు ప్రయాణం చేస్తున్నాయి. ఇందులో నాగోల్ నుండి రాయదుర్గం వరకు ఉండే ఐటీ మార్గంలో ఎక్కువగా ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఈ మార్గంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం సాయంత్రం సమయంలో అమీర్‌పేట్ జంక్షన్ నుండి రాయదుర్గం వరకు భారీగా రద్దీ ఉంటుంది. దాంతో కొన్ని సందర్భాల్లో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచి ఇబ్బందులు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు మెట్రో అధికారులు. ఇక మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పీక్ అవర్స్ మినహాయిస్తే మిగతా సందర్భాల్లో రద్దీ నార్మల్‌గానే ఉంటుందని అంటున్నాయి మెట్రో వర్గాలు.

ప్రస్తుతం ఉన్న రద్దీకి 57 రైళ్లు సరిపోతాయని మెట్రో వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ 57 రైళ్లు ప్రతిరోజు 1100 ట్రిప్పులు ప్రయాణిస్తూ దాదాపు 5 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మెట్రో ప్రయాణికుల సంఖ్య ఏడు లక్షల వరకు చేరినా కూడా ఇబ్బంది లేకుండా మెట్రో ఆపరేషన్స్ కొనసాగించవచ్చని అయితే ప్రయాణికులు కొంత క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెబుతున్నారు మెట్రో అధికారులు

అయితే ప్రస్తుతం మెట్రో రైళ్లలో రద్దీ భారీగా పెరగడంతో.. కోచ్‌లు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే మెట్రో కోచ్‌లు పెంచకుండా పది రైళ్ళను అదనంగా తీసుకురావాలని మెట్రో అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంతో రద్దీని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఉన్న 57 రైళ్లకు మరొక పది రైళ్ళను తీసుకురావడం ద్వారా రాయదుర్గం నాగోల్ మార్గంలో ఎక్కువ రైళ్లను నడిపి రద్దీని తగ్గించే ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రతి సమయంలో మూడు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నారు అధికారులు అయితే 90 సెకండ్లకు ఒక రైలు నడిపే అవకాశం ఉండడంతో రైళ్ల సంఖ్యను పెంచడం ద్వారా రద్దీని కంట్రోల్ చేయవచ్చని ప్లాన్ చేస్తున్నారు. పెరిగే పది రైళ్లు ప్రతిరోజు అదనంగా 200 ట్రిప్పులు చేసినా.. ఆ మేరకు రద్దీని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దేశంలో మూడు రైలు కోచ్ సంస్థలను ఇప్పటికే సంప్రదించినట్లు చెబుతున్నారు. అయితే త్వరలో ఆర్డర్ పెడతామని ఆర్డర్ ఇచ్చిన నాటి నుండి 18 నెలల్లో కోచులు తమకు వచ్చే అవకాశం ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. మొత్తానికి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లను కొనుగోలు చేయడంపై హైదరాబాద్ నగర వాసులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి కొత్త కోచ్‌లు వచ్చిన తర్వాతైనా రద్దీ తగ్గుతుందో లేదో చూడాలి.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్