తల్లితో పాటు ఆసుపత్రిలో చేరిన ఎంపీ అవినాష్‌రెడ్డి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్నూలు నగరంలోని విశ్వ భారతి ఆసుపత్రిలో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మితో పాటు చేరారు. ఈ ఉదయం శ్రీలక్ష్మికి ఛాతీనొప్పి రావడంతో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని కోరగా.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించాలని భావించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణకు హాజరుకావాల్సిన అవినాష్‌రెడ్డి.. వెంటనే పులివెందుల బయలుదేరి వెళ్లారు. మార్గ మద్యంలో తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద శ్రీలక్ష్మి ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ అవినాష్‌కు ఎదురైంది. ఆ వెంటనే వాహనం దిగిన అవినాష్.. తన తల్లిని చూడడానికి వెళ్లారు. ఆమె ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ లో ఎక్కి హైదరాబాద్‌ వైపు బయలుదేరారు. తన తల్లికి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో కర్నూలు నగరంలోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి కూడా ఛాతీలో సమస్య తలెత్తిందని అదే హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అవినాష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.

 

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్