సృష్టికి మూలం అమ్మ.. ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. నేడు మాతృ దినోత్సవం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సృష్టికి మూలం అమ్మ. ప్రేమకు ప్రతిరూపం అమ్మ. పురిటినొప్పులు భరిస్తూ చావు అంచుల దాకా వెళ్లి తన పుత్రుడి కోసం చచ్చిబ్రతికిన దయాహృదయమూర్తి అమ్మ. పుత్రుని కడుపు నింపి తాను పస్తులుండటానికైనా సిద్ద పడుతుంది. కొడుకు ఎంత కీచకుడైన.. వాడు నా కొడుకే అనగలేది ఒక్క అమ్మ మాత్రమే. చచ్చే చివరి క్షణం వరకు బిడ్డల సంక్షేమం కోరే కరుణామూర్తి అమ్మ. తన కుటుంబానికి అనురాగం, ఆప్యాయతను పంచేది అమ్మ. పుట్టిన శిశువుకు తొలిగురువు అమ్మ. నవజాత శిశువు మొదటి భద్రత అమ్మ. ఏ పిలుపులో లేని కమ్మతనం.. ఒక్క అమ్మ పిలుపులో కనిపిస్తుంది. అమ్మ చల్లని చూపు.. ఎంతో అండగా అనిపిస్తుంది. అమ్మ చేతి స్పర్శ అన్ని రోగాలకు మందు. అమ్మ ఒడి.. అన్ని దుఃఖాలను పోగొట్టే దివ్యక్షేత్రం. అలంటి అమ్మకు అసలు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. అసలు తీర్చుకుంటామా.

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ జాయిన్ చేస్తున్నారు. చిన్నప్పుడు చనుబాలు తాగించి పెంచిన పిల్లలు.. పెద్దయ్యాక తల్లిందండ్రులు భారంగా మారుతున్నారు. కనీసం కన్నందుకైనా చివరి రోజుల్లో ఒక్క ముద్ద పెట్టలేకపోతున్నారు. తన శరీరం ఏర్పడింది ఆ మాతృమూర్తి గర్భం నుండే అని మరచిపోతున్నారు. కొడుకులు చేస్తున్న దాష్టికాలు చూసి.. ఇలాంటి వాడిని చూడటానికి కన్నమా అంటూ రోదిస్తున్నారు. మనం తల్లికి బంగారం ఆభరణాలు చేయించాల్సిన అవసరం లేదు. పెద్ద భవంతికి మహారాణి చేయాల్సిన అవసరం లేదు. కనీసం కన్నందుకు గౌరవించుకుంటూ.. ఒక్క ముద్దపెడితే చాలు. వాడు నా బంగారం అని ఎంత మురిసిపోతారో.. ఒక్క సారి ఆలోచిద్దాం. తల్లిని సేవిద్దాం.. తరతరాలకు తల్లి ప్రశస్తిని చాటుదాం.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్