సీనియర్ నటుడు మోహన్ బాబు జర్నలిస్టు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇంట్లో ఉండాల్సిన వ్యవహారాన్ని బయట పెట్టుకున్నారని, అందులోని నిజానిజాలను బయట పెట్టడానికి సిద్ధమైన జర్నలిస్టుపై దాడి చేయడం సరికాదని అన్నారు. అందుకే మోహన్ బాబు బయటకు వచ్చి ఆ రిపోర్టర్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాయపడిన జర్నలిస్టుని పరామర్శించాలని హితవు పలికారు రాజాసింగ్.