ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌ను ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్ పై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎక్స్‌ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ళ శ్రీనివాస్ అరెస్ట్ అక్రమమని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ మండిపడ్డారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అంటూ ఫైర్ అ్యారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని చెప్పారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సెలవు రోజుల్లో కావాలని బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి…. బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు తాము కాదన్నారు. తెలంగాణ సమాజమే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హరీష్‌రావు హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.

Latest Articles

బేగంపేట్ రైల్వేస్టేషన్‌లోకి వర్షం నీరు

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి బేగంపేట్‌ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్