బీజేపీ, బీఆర్ఎస్‌లపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. దేశ, రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని చూస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెపుతున్న బీఆర్ఎస్ నేతలు మరి పదేళ్ల పరిపాలనలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతో కరెంట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణాలో మంచినీరు, కరెంటు, రుణమాఫీ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఇవన్నీ జరగాలంటే హస్తం గుర్తుపై ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎన్నికల ప్రచారంలో భట్టితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్‌లపై మంత్రులు భట్టి, పొంగులేటి మండిపాటు
0
248
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


