మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలుపుతామన్నారు. గాంధీభవన్లో తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొని మాట్లా డారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 23 అంశాలు చేర్చామన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నా రు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం వివిధ రకాల యూనివర్సిటీలు తెస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తా మని, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి గడపకూ మేనిఫెస్టోను తీసుకెళ్లాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు
0
219
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


