26.7 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును కళాశాల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత పద్ధతిని పునరుద్ధరిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 3 వేల 500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని తెలిపారు. విద్యార్ధులకు సంబంధించిన సర్టిఫికెట్‌లు, ఇతర డాక్యుమెంట్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు తన పూర్తి సహకారం, మద్దతు ఉంటాయని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఇటు విద్యార్ధులతో పాటు కళాశాల యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అనేక మంది విద్యార్ధులు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.

Latest Articles

ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపి ఉంటుంది? అసలు నిజం ఇదే!

మనకు ఇష్టమైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచినప్పుడు అందులో సగం వరకు మాత్రమే చిప్స్ ఉండి, మిగతా భాగం మొత్తం గాలితో నిండిపోయి ఉండటం చూసి చాలా మందికి నిరాశ కలుగుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్