ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) కాన్వాయ్‌లో మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వాహనాల సంఖ్యను తగ్గించే దిశగా అధికారులతో సీఎం కార్యాలయం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే నగర పరిసర ప్రాంతాల్లో సీఎం ప్రయాణాలు రెండు లేదా మూడు వాహనాలతోనే కొనసాగుతున్నాయి.
దూర ప్రయాణాలు, భద్రతా అవసరాలు ఉన్న సందర్భాలు మినహా సాధారణ పర్యటనల్లో కాన్వాయ్‌ను పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయంపై ఆలోచన జరుగుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి మూడు వాహనాలకే పరిమితమై ప్రయాణిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపుపై త్వరలోనే సీఎంవో అధికారిక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.


