ఫార్ములా ఈ రేస్‌ కేసు.. కేటీఆర్‌కు కోర్టు సమన్లు

హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌( K. T. Rama Rao)కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి జులై 31న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మాజీ ఉన్నతాధికారులు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డికీ కూడా సమన్లు జారీ చేసింది. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అనుమతుల ప్రక్రియపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా, అరవింద్ కుమార్‌ను ఏ2గా, బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చారు. అలాగే కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా, ఎఫ్‌ఈవో సంస్థను ఏ5గా పేర్కొన్నారు.

2023లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ పేరుతో విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి రూ.55 కోట్లు ఎఫ్‌ఈవో సంస్థకు బదిలీ అయినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్