గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో మంత్రి నారా లోకేశ్ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. నిన్న సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇవాళ రాష్ట్రంలో మరో 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వీటిని జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఐదు రుపాయలకే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు.
రాష్ట్రంలో 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందించనున్నారు.