ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. స్వర్ణాంధ్ర 47 ప్రణాళికపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి అవకాశాలు, సేవారంగం, అభివృద్ధి మౌలిక సదుపాయాలపై చర్చించామని అన్నారు. నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేనేత, పర్యాటక కేంద్రంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు అధికారులు పలు సూచనలు చేశారని చెప్పారు.