పరువునష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఓ మీడియా సంస్థపై పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. పరువుకు భంగం కలుగజేసేందుకు అసత్య కథనాలు ప్రచురించారని.. తప్పుడు కథనం రాసిన మీడియా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో ఓ పత్రికలో స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని నారా లోకేష్ అప్పట్లో తెలిపారు.


