స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలోకి తనను లాగుతున్నారని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుజేసే విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
‘‘ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వమన్నారు. ఒక దురదృష్టకర ఘటనను చూపి ఉద్యోగాలు ఆపాలని చూస్తున్నారని.. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వం వేర్వేరు అనే జ్ఞానం కూడా విపక్షాలకు లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నేతల ఉచ్చులో యువత చిక్కుకోకుండా ఉద్యోగాల సన్నద్ధతను కొనసాగించాలి’’ అని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు.