ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మహాసభలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆహ్వానం అందింది. తానా సభలకు రావాల్సిందిగా ఆ సంఘం ప్రతినిధి బృందం శుక్రవారం మంత్రిని ఆహ్వానించింది. తానా సభ్యుల బృందం హైదరాబాదులోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. అమెరికా లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలైలో నిర్వహించనున్న 23వ తానా మహాసభలు జరుగనున్నాయి. తనను ఆహ్వానించినందుకుగాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రతినిధి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
తానా సభలకు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం
0
273
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


