మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్-లావణ్య డెస్టినేషన్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. చాలా మంది సెలబ్రిటీలు ఇదే ఫాలో అయిపోతున్నారు. తాజాగా ఈ లిస్టులో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి చేరారు. విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవల ఎక్కువగా ఉంది. లేదంటే జైపూర్ లాంటి ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఇప్పుడు వరుణ్-లావణ్య త్రిపాఠి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొనేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది.  ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పుడే మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి మొదలైంది. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

తాజాగా ఈ జంట పెళ్లి గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే వరుణ్ లావణ్య ల పెళ్లి ఇటలీలో అది కూడా రాజరిక పద్ధతిలో జరగనుంది. ఇటలీలో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఎంతో ఘనంగా జరగనున్న ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిపి కేవలం 50 మంది మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి తర్వాత హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఇటలీలోనే ఈ పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక రీసన్ ఉంది. వరుణ్ లావణ్య మొదటిసారి కలిసి నటించిన మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఆ షూటింగ్ సమయంలోనే మొదటిసారి ఈ జంట కలుసుకున్నారట అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట వరుణ్ లావణ్య.

వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా అంటే ఆగస్ట్ 24న వరుణ్, లావణ్య పెళ్లి జరగనుందట.

Latest Articles

నీటి ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమింపజేసిన ‘ హైడ్రా’

వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్