స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. చాలా మంది సెలబ్రిటీలు ఇదే ఫాలో అయిపోతున్నారు. తాజాగా ఈ లిస్టులో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి చేరారు. విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవల ఎక్కువగా ఉంది. లేదంటే జైపూర్ లాంటి ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఇప్పుడు వరుణ్-లావణ్య త్రిపాఠి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొనేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పుడే మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి మొదలైంది. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా అంటే ఆగస్ట్ 24న వరుణ్, లావణ్య పెళ్లి జరగనుందట.