స్వతంత్ర, వెబ్ డెస్క్: సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి హాస్టల్ గదిని పోలీసులు ఎట్టకేలకు తెరిచారు. కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని రూమ్ నెంబర్ 409లో ప్రీతి ఉండేది. ఆమె ఆత్మహత్య తర్వాత ఈ గది నాలుగు నెలలుగా మూసి ఉంది. ఇన్ని రోజుల తర్వాత కుటుంబసభ్యులు, అధికారుల సమక్షంలో పోలీసులు రూమ్ ఓపెన్ చేశారు. గదిని తెరిచాక ప్రీతి వస్తువుల్ని చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. అనంతరం ప్రీతి లగేజీ ప్యాక్ చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ గదిలో ఇంజెక్షన్లు, సూదులు, మెడికల్ కిట్స్ లభ్యమయ్యాయి. మరోవైపు ప్రీతి ఆత్మహత్య కేసులో వరంగల్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కాగా సీనియర్ స్టూడెంట్ సైఫ్ చేసే ర్యాగింగ్ భరించలేక ఆమె సూసైడ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎట్టకేలకు మెడికో ప్రీతి హాస్టల్ గది తెరిచిన పోలీసులు
0
293
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


