సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ కోరారు. సంగారెడ్డికి మెట్రో పక్కా అని ప్రచారంలో హామీ ఇచ్చానని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు భేటీ అయ్యారు. 30 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేస్తామని ఎండీ హామీ ఇచ్చారని ఎంపీ రఘునందన్ తెలిపారు. తొలి దశలో పటాన్‌చెరు వరకు మెట్రో తీసుకువస్తానని అన్నారు. రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో తీసుకువస్తానని ఎంపీ రఘునందన్ చెప్పారు.
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు భేటీ
0
270
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


