Free Porn
xbporn
33.7 C
Hyderabad
Thursday, September 19, 2024
spot_img

‘రూల్స్ రంజన్’లోని ‘దేఖో ముంబై’ సాంగ్‌ను లాంచ్ చేసిన రవితేజ

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నంకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. నాలో నేనే లేను, సమ్మోహనుడా, ఎందుకురా బాబు పాటలు ఒక దానిని మించి ఒకటి ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేశారు మేకర్స్.

‘రూల్స్ రంజన్’ నుంచి ‘దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియో మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 10:20కు విడుదలైంది. విడుదల సందర్భంగా పాట బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించిన రవితేజ.. చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్‌గా ఉంది. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం కాలు కదిపించేలా ఉంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్, మేఘ్-ఉ-వాట్ సాహిత్యం అందించారు. “దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్‌లో మస్తీ మజా..” అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు అమితంగా ఆకట్టుకుంది. “నువ్ పక్కనుంటే చిల్లు, తిరగొద్దే వాచు ముల్లు.. నీకు రెక్కలిచ్చే ఒళ్ళు, ఎగిరెళ్లు” అంటూ తేలికైన పదాలతో పాటను ఎంతో అందంగా, అర్థవంతంగా రాశారు. ఇక ఉత్సాహవంతమైన సంగీతానికి తగ్గట్టుగా అద్నాన్ సమీ, పాయల్ దేవ్ పాటను మరింత ఉత్సాహంగా ఆలపించారు. సంగీతం, సాహిత్యం, గానంతో పాటు శిరీష్ నృత్య రీతులు ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబై బీచ్‌తో పాటు నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ వేసిన స్టెప్పులు అలరించాయి. లిరికల్ వీడియోనే ఇలా ఉంటే, బిగ్ స్క్రీన్ మీద ఫుల్ వీడియో సాంగ్‌కి థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయమని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ వినోదాత్మక చిత్రం ఘన విజయం సాధిస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

తారాగణం:

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్

సాంకేతిక బృందం:

రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest Articles

జెమిలి ఎన్నికలు అనేవి ఒక పిచ్చి తుగ్లక్‌ చర్య – తులసిరెడ్డి

జెమిలి ఎన్నికలు అనేవి ఒక పిచ్చి తుగ్లక్‌ చర్య అని.. దానిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్‌ నేత తులసి రెడ్డి అన్నారు. జెమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదు అని అన్నారు. రాజ్యాంగ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్