Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

Martin Luther King Review: ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ మూవీ రివ్యూ

విడుదల తేది: అక్టోబర్‌ 27, 2023
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు
నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా
దర్శకత్వం: పూజ కొల్లూరు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా
సంగీతం: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ: దీపక్ యరగెరా

ఈ రోజు ఐదారు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ వారం బాక్సాఫీస్‌ బరిలో నిలిచిన వాటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. మాతృకలో యోగిబాబు పోషించిన పాత్రను మన దగ్గర సంపూర్ణేశ్‌ బాబు చేశారు. ఈ అంశాలే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది? మార్టిన్‌ లూథర్‌ కింగ్‌గా సంపూర్ణేశ్‌ బాబు ఎలా అలరించారు? అన్నది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.

కథ:
పడమరపాడు అనే గ్రామంలో ఉత్తరం వైపు ఒక కులం వాళ్లు.. దక్షిణం వైపు ఇంకో కులం వాళ్లు ఉంటారు. ఇరు కులాలకు అస్సలు పడదు. ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. దీంతో ఆ ఊరి ప్రెసిడెంట్‌ రెండు కూలాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని..ఉత్తరం, దక్షిణం వాళ్లకు సమ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్‌), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్‌ మహా) మాత్రం ఎప్పుడూ గొడవపడుతుంటారు. వారిద్దరి గొడవల కారణంగా ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఊర్లో మరుగుదొండ్లు ఉండవు. రోడ్లు సరిగా ఉండవు. ఇలా పలు సమస్యలతో బాధపడుతున్న ఆ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్‌ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్‌ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో..ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఓటు కోసం స్మైల్(సంపూర్ణేశ్‌ బాబు) వెంట పడుతారు. అనాథ అయిన స్మైల్‌ తనతో పాటు ఉండే బాటాబాబుతో కలిసి పడమరపాడు గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటారు. ఆ ఊరిలో ఉన్న మర్రి చెట్టే వాళ్లిద్దరికీ నివాసం. ఊరి వాళ్లంతా స్మైల్‌ను ఎడ్డోడు.. వెర్రిబాగులోడు.. అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇంట్లో ఎవరైనా పాచి పనులు చేయాలంటే తననే పిలుస్తుంటారు. వాళ్లిచ్చే చిల్లర డబ్బులతోనే పూట గడిపేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ చిన్న చెప్పుల షాప్‌ పెట్టుకోవాలన్నది స్మైల్‌ కల. దాని కోసం రూపాయి రూపాయి పోగు చేసి కొంత డబ్బు దాచుకుంటాడు. అయితే ఓరోజు ఆ డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన స్నేహితుడు బాటా సలహా మేరకు పోస్టాఫీసులో డబ్బు దాచుకోవాలని నిర్ణయించుకుంటాడు. దీనికోసం పోస్టాఫీస్‌లో పని చేసే వసంత (శరణ్య ప్రదీప్‌)ను సాయం కోరతాడు. అయితే పోస్టాఫీస్‌లో అకౌంట్ కావాలంటే స్మైల్‌కు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు.. ఇలా ఏ గుర్తింపు కార్డు ఉండదు. స్మైల్‌ అసలు పేరేంటో కూడా తెలియదు. దీంతో అతనికి ఏదైనా ఒక మంచి పేరు పెట్టాలని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అనే కొత్త పేరు పెట్టి.. పోస్టాఫీస్‌లో అకౌంట్‌ తెరుస్తుంది వసంత. అలాగే అతడి పేరిట ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు.. ఇలా అన్నింటికీ అప్లై చేస్తుంది. మరోవైపు పడమరపాడులో సర్పంచ్‌ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దక్షిణం దిక్కుకు పెద్దగా వ్యవహరించే లోకి (వెంకటేశ్‌ మహా), ఉత్తరం దిక్కుకు నాయకుడిగా వ్యవహరించే జగ్గు (నరేశ్‌) సర్పంచ్‌ పదవి కోసం పోటీ పడతారు. అదే సమయంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో లోకి, జగ్గు అతణ్ని తమవైపు తిప్పుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మరి మార్టిన్‌కు ఓటు హక్కు రావడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? జగ్గు, లోకిల వల్ల తనెలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? తన ఓటుతో ఊరిని ఎలా మార్చాడు? అన్నది మిగతా కథ .

విశ్లేషణ:
ఓటు ప్రాధాన్యతని తెలియజేస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కూడా అలాంటి చిత్రమే. గ్రామాల్లో జరిగే అసలైన రాజకీయాలను తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రజాస్వామ్యం పవర్‌ ఏంటి? ఓటు హక్కు విలువ ఏంటి? అనేది ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు పూజా కొల్లూరు. తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘మండేలా’కి రీమేక్ అయినా.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం పొలిటికల్‌ సెటైరికల్‌గానే సాగుతుంది. ఇది ప్రధానంగా ఓటు విలువని తెలియజెప్పే చిత్రం. అంతర్లీనంగా సమాజంలో అసమానతల్ని ఎత్తి చూపుతూ ఆలోచింపజేస్తుంది. అలాగే వర్తమాన రాజకీయాలపై ఓ విమర్శనాస్త్రంగా ఉంటుంది. ఇది రీమేక్‌ చిత్రమైనా తెరపై చూస్తున్నప్పుడు ఆ అనుభూతి ఎక్కడా కలగదు. మాతృకలోని ఆత్మను దెబ్బ తీయకుండా వెంకటేశ్‌ మహా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా కథను చక్కగా మార్పులు చేశారు. దాన్ని దర్శకురాలు పూజ కూడా అంతే నిజాయతీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి సందేశాత్మక చిత్రాల్ని కాసిన్ని కమర్షియల్‌ హంగులు జోడించి తెరపై చూపించగలిగినప్పుడే ఆశించిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ విషయంలో మార్టిన్‌ వెనకబడినట్లు అనిపిస్తుంది. పడమరపాడు గ్రామం.. అక్కడి ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేస్తూ వచ్చే ఆరంభ సన్నివేశాలు బాగున్నాయి. ఈ క్రమంలో వచ్చే మరుగుదొడ్డి ఓపెనింగ్‌ ఎపిసోడ్‌.. అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు వర్గాలు తలపడే తీరు నవ్వులు పూయిస్తాయి. ఆ వెంటనే స్మైల్‌ ప్రపంచాన్ని.. ఊరి ప్రజలు అతనితో వ్యవహరించే విధానాన్ని చూపిస్తూ నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. స్మైల్‌ డబ్బుల్ని ఎవరో దొంగలించడం.. దీంతో తను డబ్బులు దాచుకునేందుకు పోస్టాఫీస్‌లోకి అడుగు పెట్టడం.. అక్కడ వసంతతో పరిచయమవడం.. ఆమె అతనికి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అని పేరు పెట్టడం.. ఇలా కథ క్రమంగా ఓ చిన్న మలుపు తిరుగుతుంది. పడమరపాడులో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఊర్లోని ఓటర్లను ఆకర్షించేందుకు లోకి, జగ్గు డబ్బులతో ప్రలోభ పెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ విషయాల్లో నాయకులు ప్రజల్లోని సెంటిమెంట్‌ను ఎలా అడ్డం పెట్టుకుంటారన్నది ఆసక్తికరంగా చూపించారు. దీనికి తోడు జగ్గు, లోకి పాత్రలు ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకుల్ని గుర్తు చేసేలా ఉండటంతో వాటితో ప్రేక్షకులు వెంటనే కనెక్ట్‌ అయిపోతారు. విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తి కలిగించేలా చేస్తాయి.

మార్టిన్‌ ఓటు తమకు పడేలా చేసుకునేందుకు లోకి, జగ్గు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్ధం మొదలవుతుంది. ఎప్పుడైతే మార్టిన్‌ ఓటు కీలకమని ఊరి ప్రజలకు అర్థమవుతుందో.. అక్కడ్నుంచి ఊరి వారంతా అతనితో వ్యవహరించే తీరు మారిపోతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి. మార్టిన్‌ను ఆకర్షించేందుకు జగ్గు, లోకి పోటీ పడి అతనికి కానుకలు ఇవ్వడం.. అతను మాత్రం ఎవరికి ఓటు వేయాలో తెల్చుకోలేకపోతున్నాని చెబుతూ పబ్బం గడుపుతూ పోవడం నవ్విస్తుంది. అయితే ఈ ఎపిసోడ్‌ను మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక మార్టిన్‌ ఓటు కోసం లోకి, జగ్గు వేలానికి దిగడం.. ఈ క్రమంలో అతని ఓటు కోసం కోటి రూపాయలు గుమ్మరించేందుకు ఇద్దరూ సిద్ధపడటం కాస్త అతిగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో మార్టిన్‌ మిత్రుడు బాటా చుట్టూ అల్లుకున్న మెలో డ్రామా సహనానికి పరీక్షగా నిలుస్తుంది. ఓటు విలువ తెలుసుకొని మార్టిన్‌ తన ఆలోచనా విధానాన్ని మార్చుకునే తీరు.. ఊరి అభివృద్ధి కోసం దాన్ని వినియోగించిన విధానం ఆకట్టుకుంటాయి.

నటీనటుల విశ్లేషణ:
బర్నింగ్ స్టార్‌గా పేరొందిన సంపూర్ణేశ్‌ బాబుకు నటుడిగా ఇదొక సరికొత్త ప్రయత్నం. ఇప్పటి వరకు స్పూఫ్‌ కామెడీ సినిమాలతో అలరించిన ఆయన ఇందులో కొత్త అవతారమెత్తారు. అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. టైటిల్‌ పాత్రలో సంపూ ఒదిగిపోయాడు. తనదైన అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. భావోద్వేగభరితమైన పాత్రతో అలరించారు. ఆద్యంతం ఓ సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నారు. మార్టిన్‌ పాత్రకు తగ్గట్లుగా చాలా సహజమైన నటనను కనబరిచారు. జగ్గు పాత్రకు నరేశ్‌ తనదైన నటనతో జీవం పోశారు. అలాగే లోకి పాత్రలో వెంకటేశ్‌ కూడా నరేశ్‌కు దీటైన నటనను కనబరిచారు. వసంత పాత్రలో శరణ్య సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఇక సంపూ పాత్రకి అసిస్టెంట్‌ బాటా పాత్రను పోషించిన యువకుడి నటన బాగుంది. ఊరి ప్రెసిడెంట్, లోకి, జగ్గుల తండ్రి పాత్రను పోషించిన రాఘవన్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.

సాంకేతిక విశ్లేషణ:
దర్శకురాలు పూజా కొల్లూరి ఇది తనకు మొదటి చిత్రమే అయినా తనకందించిన స్క్రిప్ట్‌నకు నిజాయతీగా న్యాయం చేసే ప్రయత్నం చేశారు. సామాజిక బాధ్యత కలిగిన ఇలాంటి డైరెక్టర్లు మరింత మంది ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం ఉంది. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తూ.. సినిమాలను ఎలివేట్‌ చేసేలా ఉంటాయి. దీపక్‌ యరగెరా సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూజ కొల్లూరు.. ఎడిటర్‌గానూ వ్యవహరించడం విశేషం. కానీ ఎడిటర్‌గా తన కత్తెరకు మాత్రం సరిగా పని చెప్పలేకపోయింది. సినిమాలో చాలా చోట్ల సాగదీత సన్నివేశాలు కనిపిస్తాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరిగా.. ఓటును అమ్ముకోవద్దని చెప్పే ‘మార్టిన్ లూథర్ కింగ్’

రేటింగ్: 2.75/5

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్