Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

పెళ్లంటే వందల కోట్ల సంబురం!

భారతీయ సంప్రదాయంలో పెళ్లంటే చిన్న విషయం కాదు. ఒక అమ్మాయి, అబ్బాయి మనస్సాక్షితో వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టడం. అంతేకాదు….రెండు కుటుంబాల కలయిక. వీటన్నిటితో పాటు ఒక వివాహం అనేకమందికి ఉపాధి కల్పిస్తుంది. పెళ్లిళ్ల సీజన్‌ వస్తే చాలు బంగారం దుకాణాలు కళకళలాడతాయి. లైటింగ్, పూలు, వీడియోగ్రాఫర్లు క్యాటరింగ్, ఫర్నిచర్ …ఇలా వివాహంతో ముడిపడి ఉన్న అన్ని వ్యాపారాలు జోరందుకుంటాయి.

చక్కటి ముహూర్తం చూసుకుని, లక్షణమైన కల్యాణ మంటపంలో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవడం మన సంప్రదాయం. పెళ్లంటే మాటలా.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి ఒకరికొకరూ నచ్చాలి. ఉభయ కుటుంబాలకూ మధ్య సయోధ్య కుదిరాలి. ఇక కల్యాణ మంటపాలు, శుభలేఖలు, పెళ్లి దుస్తులు, ఫొటోలు, వీడియో, ట్రావెల్స్, పూలు, పురోహితులు, డీజేలు..ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్‌ మేళాలు, కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకూ అనేక విషయాలు వివాహంతో ముడిపడి ఉంటాయి. వివాహం అంటే రెండు కుటుంబాల కలయిక. అంతేకాదు..సమాజంలోని అనేక వృత్తుల వారికి ఉపాధి. ఒక్క వివాహం…అనేక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది.

పెళ్లంటే చిన్న విషయం కాదు. ఎటు చూసినా భాజా భజంత్రీలు….తళుకులీనే రంగురంగుల విద్దుద్దీపాలు…పెళ్లి మండపాల్లో అలంకరణలు…విందు భోజనాలు…స్వర్ణాభరణాలు…కొత్త కొత్త డ్రస్సులు…యూత్ అయితే సినిమా స్టార్స్‌ కు ఏమాత్రం తగ్గరు. ఈ రోజుల్లో జరిగే ప్రతి వివాహంలోనూ ఇదంతా ఉంటుంది.

పెళ్లంటే ..వందల కోట్ల రూపాయల వ్యాపారం. లక్షలాది మందికి బతుకుదెరువు. పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు….బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, బట్టల అమ్మకాలు, వంటింటి సామాగ్రి, ఫర్నిచర్ వంటి అనేక రకాల బిజినెస్సులు జోరందుకుంటాయి. వీటి అమ్మకాలు ఆకాశాన్ని తాకుతాయి. మరీ ముఖ్యంగా నిశ్చితార్థం ఉంగరాలనుంచి, ఆభరణాలు, తాళిబొట్టు అన్నీ ఉండాల్సిందే. వివాహాల సీజన్ వస్తే చాలు….బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. కొన్ని జ్యూయలరీ షాపుల వాళ్లయితే, పెళ్లిళ్ల సీజన్‌లో ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఒకటనేమిటి…వివాహంతో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యాపారాలు జోరందుకుంటాయి. కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కళకళలాడుతుంటాయి.

పెళ్లి చేయడం అంటే చిన్న విషయం కాదు. బంధుమిత్రులకు భోజనం పెట్టాలి. పాత రోజుల్లో బంధుమిత్రుల సంఖ్య పరిమితంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కోసారి వందలు కూడా దాటుతోంది. పెళ్లి విందు అంటే అలా ఇలా కాదు. ఓ రేంజ్‌లో ఉండాలి. విందు భోజనాన్ని తలదన్నే రేంజ్‌లో ఉంటుంది. రకరకాల ఆహార పదార్థాలు. అన్నీ నోరూరించేవే. ఒకదశలో ఏది తినాలో, ఏది వదిలేయాలో కూడా తెలియదు. బోలెడు ఐటమ్స్ ….అది కూడా వెరైటీగా. వివాహానికి వచ్చిన వారిలో వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు …ఇద్దరూ ఉంటారు. ఈ రెండు వర్గాలకు వేర్వేరుగా ఫుడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. చివరిలో ఐస్ క్రీమ్ మాత్రం కంపల్సరీ.

పాత రోజుల్లో అయితే వివాహ భోజనాలకు ఒకరిద్దరు వంట బ్రాహ్మణులను మాట్లాడుకునే వారు. ఎంతమంది బంధుమిత్రులు వచ్చినా, ఈ వంట బ్రాహ్మణులే భోజనం తయారు చేసేవారు. వీరికి అసిస్టెంట్లుగా మరో ఇద్దరు ముగ్గరు కుర్రాళ్లు ఉండేవారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం వివాహం అంటే అంతా క్యాటరింగే. ఇన్ని వందల మంది లేదా వేల మంది వస్తారు….ఇన్ని ఐటమ్స్ ఉండాలి…వీటిలో ఫలానా ఫలానా ఐటమ్స్ కంపల్సరీ అంటూ క్యాటరింగ్ సంస్థలకు పెళ్లి నిర్వాహకులు ఆర్డర్లు పెట్టేస్తున్నారు. సదరు క్యాటరింగ్ సంస్థకు అడిగినంత సొమ్ములు చెల్లిస్తే…అంతా రెడీ అవుతోంది. అప్పటికప్పుడు వివాహానికి వచ్చే బంధుమిత్రులు పెరిగినా…క్షణాల్లో వారికి ఆహారం సరఫరా చేస్తున్నారు. ఆ మేరకు సొమ్ములు వసూలు చేసుకుంటున్నాయి క్యాటరింగ్ సంస్థలు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్