27.9 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

‘మార్కెట్ మహాలక్ష్మి’లో కొత్త పాయింట్‌ను టచ్ చేశాం: డైరెక్టర్ ముఖేష్

బి2పి స్టూడియోస్ బ్యానర్‌లో కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా, ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వీఎస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్‌లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో  బిజీ ఉండగా, ఈ క్రమంలో దర్శకుడు వీఎస్ ముఖేష్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.

నా పేరు విఎస్ ముఖేష్. యూట్యూబ్‌లో దాదాపు 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అలా ఒకరోజు నేను అఖిలేష్‌ గారిని కలవడం “మార్కెట్ మహాలక్ష్మి” స్క్రిప్ట్‌ను నెరేట్ చేయడం జరిగింది. “మార్కెట్ మహాలక్ష్మి” స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. చాలా మంది తమ సినిమాలలో కొత్త పాయింట్‌ని టచ్ చేశామని చెప్తుంటారు. అలానే మేము కూడా నిజాయితీగా, ఇప్పటి వరకు ఆడియన్స్‌కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేసాము. ఆ మేజర్ పాయింట్‌ని ప్రమోషన్ల కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టీజర్, ట్రైలర్‌లో చూపించలేదు. ఆ కొత్త పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా.

పార్వతీశం నాకు చాలా కాలంగా తెలుసు, అతను నాకు మంచి స్నేహితుడు. హీరోహీరోయిన్లుగా పార్వతీశం, కొత్త నటిని ఎంచుకోవడానికి కారణం వాళ్ళు ఈ పాత్రలకి సరైన న్యాయం చేయగలరని నమ్మకమే. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి.. ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు.

“మార్కెట్ మహాలక్ష్మి” పూర్తి లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అది బేస్ చేసుకొని సినిమా కథ గా రాయడం జరిగింది. రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. వాస్తవికతకు దగ్గర గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము.

“మార్కెట్ మహాలక్ష్మి” బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు అద్భుతంగా మరియు ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. థియేటర్లలో ఒకసారి సినిమా చూస్తే, మీకు ఆ ఫీల్ కలుగుతుంది. శ్రీముఖితో ఇంటర్వ్యూ చేయించడం సినిమాకి బజ్ ని పెంచింది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. నా నమ్మకం నటీనటులపై కాదు, నా స్క్రిప్ట్‌పై, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను.

మార్కెట్ మహాలక్ష్మి సెన్సార్ పనులన్నీ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి థియేటర్ లో ఈనెల 19న వచ్చేస్తుంది. ఈ సినిమా మొదటి నుంచే కథతో ప్రారంభమవ్వుతుంది అందుకే, సినిమాలో ఎక్కడ మీకు డ్రాగ్ అనిపించదు. కొంతమంది పరిశ్రమ వ్యక్తులకు కూడా మేము చిత్రాన్ని ప్రదర్శించాము. సినిమా విడుదలైన తర్వాత గర్వంగా తమ అభిప్రాయాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను.

మా సినిమాలో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేసాము. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడంతో త్వరగా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో నా పొటెన్షియల్ ఏంటో చూపించాలి అనుకున్నాను. అందుకే, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి షూట్ చేసాము.

పార్వతీశం,  ప్రణీకాన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పార్వతీశంకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నాను. మాకు చాలా OTT ఆఫర్‌లు వచ్చాయి, కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారనే భావంతో రిస్క్ తీసుకున్నాం. మా సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్లలో నా సినిమాను ఒక్కరు చూసినా, తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో చెప్పగలను.

Latest Articles

వికీలీక్స్ అసాంజే జైలు నుండి విడుదల

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. లండన్‌ బెల్‌ మార్ష్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో జరిగిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్