చందానగర్ లో మంజీరా పైప్ లైన్ లీకేజి

     హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాలో కీలకమైన మంజీరా పైప్ లైన్ పగిలిపోయింది. గంగారం జీఆర్ టీ షాప్ వద్ద ఉన్న మంజీరా మెయిన్ పైప్ లైన్ నిన్న రాత్రి పగిలిపోయింది. దీంతో నీరంతా రోడ్డుపై ప్రవహించింది. మెయిన్ పైప్ లైన్ కావడంతో పెద్ద మొత్తంలో నీరు రోడ్డుపై వృధాగా పోయింది. అధికా రులు ఆలస్యంగా స్పందించడంతో అప్పటికే చాలా నీరు వృధా అయింది. ఇవాళ ఉదయం కూడా నీటి లీకేజి కొనసాగింది. ఓ వైపు నగరానికి నీటి కష్టాలు ముంచుకు వస్తుంటే అధికారులు కనీసం స్పందించక పోవడం పట్ల ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలోనూ చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద ఇలాగే మంజీరా మెయిన్ లైన్ పైప్ లీక్ అయింది. తరచూ ఇలా నీరు వృథా అవుతున్నా.. అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్