22.7 C
Hyderabad
Thursday, December 5, 2024
spot_img

నవంబర్ 3న రాబోతున్న ‘మా ఊరి పొలిమేర-2’

కొత్తకాన్పెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ‘మా ఊరి పోలిమేర’. ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం మా ఊరి పోలిమేరకు సీక్వెల్‌గా రాబోతున్న ‘మా ఊరి పోలిమేర 2” చిత్రీకరణ పూర్తి చేసుకుని.. నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై  గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు.  స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…“మా ఊరి పొలిమేర‌` మొద‌టి పార్ట్  ఎంతటి ఘనవిజయం అందుకుందో అంద‌రికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్ప‌టికే భారీ అంచానాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్ తో చేశాం. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న‌వంబ‌ర్‌ 3న మా చిత్రాన్ని గ్రాండ్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తున్నాం“ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు డా.అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ…“గ్రామీణ నేప‌థ్యంలో జ‌రిగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర‌-2` చిత్రాన్ని తెర‌కెక్కించాం. మొద‌టి పార్ట్ క‌న్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌బోతుంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక సంఘటనలను ఈ చిత్రంలో జోడించాం. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా వుంటుంది. వాట్ నెక్ట్స్ అనేది ఎవరూ ఊహించలేరు.  పాడేరు, కేర‌ళ‌, ఉత్త‌రాఖండ్ లో షూటింగ్ చేశాము. స‌త్యం రాజేష్‌, కామాక్షి అద్భుతంగా న‌టించారు. నవంబ‌ర్ 2న మా సినిమా గ్రాండ్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ కాబోతుంది“ అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతంః గ్యాని;  సినిమాటోగ్ర‌ఫీః ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి;  ఎడిటింగ్ః శ్రీ వ‌ర‌;   ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఉపేంద్ర రెడ్డి చందా;  ఫైట్ మాస్ట‌ర్ః రామ్ మాస్ట‌ర్‌; ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూస‌ర్ః ఎన్‌.సి.స‌తీష్ కుమార్;   నిర్మాతః గౌరి కృష్ణ‌;  స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైర‌క్ష‌న్ః డా.అనిల్ విశ్వ‌నాథ్‌.

Latest Articles

సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానంపై తొలిసారి వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడుపుతున్న బెల్టు షాపులు ఎత్తివేశారని అన్నారు. మొత్తం షాపులన్నింటినీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్