కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అద్భుతంగా వంట చేస్తారని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ సరదాగా మాట్లాడుతూ.. ఈ విషయాల్ని చెప్పారు. తనకుఇష్టమైన వంటలు ఏమిటో.. ఎవరి వంటలంటే ఎక్కువ ఇష్టమే చెప్పేశారు. అందరికంటే తన తల్లి, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీయే వంట విషయంలో నెంబర్. 1 అని తెలిపారు. అయితే అమ్మ సోనియా వంట.. సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు అంతగా నచ్చదని అన్నారు. తన దృష్టిలో చాలా బాగా వంట చేసే వారిలో ప్రియాంక నెంబర్. 2 అని చెప్పారు. తాను తినే ఫుడ్ విషయాలను తెలుపుతూ.. ఉదయం కాఫీ తాగుతానని, రాత్రిళ్లు చాయ్ తాగేందుకు ఇష్టపడతానని అన్నారు. ఎక్కువగా ఘాటు పదార్థాలు కంటే.. తీపి పదార్థాలే తీసిఉంటానని అన్నారు. ఫ్రాన్స్ స్వీట్ల కన్నా ఇండియన్ స్వీట్స్ కే ప్రాధాన్యతను ఇస్తానన్నారు.