రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధాన పరమైన ఆలోచన లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికివారే రూణమాఫీ తేదీలు ప్రకటించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. రుణమాఫీపై ఇప్పటికే ఐదు వాయిదాలు అయిపోయాయని, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ప్రాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కేబినెట్ భేటీ నిర్వహించి ఒకేసారి రెండు లక్షల రూపా యలు రైతులకు రూణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారని చెప్పారు. అయినా ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు చెప్పలేదన్నారు. రుణమాఫీ కి ఎన్ని నిధులు అవసరం, ఎంత మంది రైతులు ఉన్నారు అనేది ఇంకా వెల్లడించలేదని తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక విధానపరమైన ప్రకటన విడుదల చేయలేదని కొప్పుల విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
0
200
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


