మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని… కేటీఆర్ గురించి కొండా సురేఖ మట్లాడింది ఆక్షేపణీయమన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని అన్నారు. వ్యవస్థలో ఉన్న లోటు పాట్ల గురించి మాట్లాడాలని.. సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఎక్స్‌లో అని రాసుకొచ్చారు. బాధ్యత గల పదవిలో ఉండి.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.