ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవతారమెత్తారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ,తినే తిండి నాణ్యంగా ఉండాలని అన్నారు. నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీలో కుమారస్వామి బజ్జీల బండిని తనిఖీ చేశారు. ఎటువంటి నూనెలు వాడుతున్నావ్ అంటూ ఆరా తీశారు. ఆయిల్ ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కల్తీ నూనెలు వాడడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఇటువంటి నూనెలు వాడొద్దంటూ బజ్జీల బండి నిర్వాహకుడు కుమారస్వామికి క్లాస్ తీసుకున్నారు. రేపటినుండి నాణ్యమైన నూనెలతోనే ఆహార పదార్థాలు చేయాలని సూచించారు. అప్పటికప్పుడు 10,000 ఆర్థిక సహాయం చేసి నాణ్యమైన నూనెతో బజ్జీలు చేయాలని కుమారస్వామిరి రాజగోపాల్ రెడ్డి సూచించారు. పక్కనే ఉన్న కిరాణా షాపును సైతం తనిఖీ చేశారాయన. వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడి నుండి తెస్తున్నారు అంటూ ఆరా తీశారు. కల్తీ నూనెల వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, క్యాన్సర్ బారిన పడుతున్నారని… అలాంటి నూనెలు వాడొద్దని సూచించారు.