బెడిసికొట్టిన యువతి కిడ్నాప్ ప్లాన్

   ఇది సినిమానా అంటే సినిమా కాదు…షార్ట్ ఫిలిం నా అంటే అదీ కాదు..? కాని సినిమాను మించిన తరహాలో తన ప్రేమికుడి కోసం ప్లాన్ చేసింది ఓ యువతి. ఏంటా ప్లాన్…అతన్ని దక్కించుకోవడానికి ఆ యువతి ఏం చేసింది..?

   సినిమా కథను మించిన క్రైమ్‌ కథను హైదరాబాద్‌ పోలీసులు చేధించారు. నచ్చినవాడిని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైంది ఓ యువతి. ఏకంగా యువకుడిని కిడ్నాప్‌ చేసి… తన వాడిని చేసుకోవాలను కుంది. యువతి చెర నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రా యించాడు ఆ యువకుడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ చూసి ఓ యువకుడిని చూసి ఇష్టపడిన అమ్మాయి.. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడింది. అతను నిరాకరించడంతో రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ కిడ్నాప్‌ చేయించింది. పది రోజులుగా తన రూమ్‌లోనే బంధించింది. చివరకు యువతి చెర నుంచి తప్పించుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

     ప్రణవ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూనే.. ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పార్ట్‌ టైమ్‌జాబ్‌ చేస్తు న్నాడు. రెండేండ్ల క్రితం ప్రణవ్‌ ఫొటోను మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూసిన త్రిష అనే యువతి అతన్ని ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోవాలనుకుని అతడిని సంప్రదించింది. దీంతో తన పేరుతో ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశారని తెలుసుకున్న ప్రణవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ప్రణవ్‌ ఫోటో చూసి మనసుపడ్డ యువతి అతనితో పరిచయం పెంచుకుంది. అదే పరిచయంతో తనను పెండ్లి చేసుకోవాలని త్రిష ఒత్తిడి చేయడం మొదలుపె ట్టింది.పెళ్లికి ప్రణవ్‌ నిరాకరించడంతో త్రిష అతనిపై నిఘా పెట్టింది. అతని కారులో లొకేషన్‌ ట్రాకర్‌ అమర్చింది. ప్రణవ్‌ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో గమనిస్తూ ఉంది. ఈ నెల 11న రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ కిడ్నాప్‌ చేయించింది. అప్పట్నుంచి తన రూమ్‌లోనే బంధించింది. ఈ క్రమంలో త్రిష చెర నుంచి తప్పించుకున్న యాంకర్‌ ప్రణవ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, త్రిష హైటెక్‌ సిటీలో డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్