కేసీఆర్ గొంతులో స్పష్టంగా ఓటమి భయం కనిపిస్తుంది- రేవంత్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  మొత్తం సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోవడం.. అలాగే   కేసీఆర్ రెండు చోట్ల  పోటీ  చేయడమే దీనికి సంకేతమన్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. తన సవాల్ ను స్వీకరించకుండా కేసీఆర్ సిట్టింగుల స్థానాలు మార్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని రేవంత్ అన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు.

రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివి తేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 రుణమాఫీ చేసి కేసీఆర్ రూ. 11 వేల కోట్లు మిగుల్చుకున్నారని చెప్పారు.  ఒక్క రూపాయి అని అందరు అనుకుంటున్నారు కానీ దాని వల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో పాటు  ప్రభుత్వానికి 11 వేల కోట్లు మిగుల్చుకున్నారని  తెలిపారు.  కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందన్నారు.

Latest Articles

బాలకృష్ణకు సినిమా షూటింగ్‌లో స్వల్పగాయం

సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్‌లో స్వల్పగాయమైంది. కాకినాడ పోర్టులో జరుగుతున్న యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణలో ప్రమాదవశాత్తు ఆయన మోకాలికి గాయమైంది. వెంటనే చిత్రబృందం బాలకృష్ణను సమీప ఆస్పత్రికి తరలించి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్