గుడివాడలో కొడాలి నానిని ఓడించి తీరుతాం: కాపు నేతలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన నేతలు డిమాండ్ చేశారు. ఓ బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ కులం పేరుతో బూతులు మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. కొడాలి నాని తీరును రాష్ట్రంలోని అన్ని వర్గాలు గమనిస్తున్నాయని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసినంత మాత్రాన సరిపోదని ఇతర కులాలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

కొడాలి నాని తీరును వైసీపీలోని కాపు నాయకులు వ్యతిరేకించాలని కోరారు. కాపు జాతిని కించపరడం యావత్ రాష్ట్రానికి అవమానమని వ్యాఖ్యానించారు. గుడివాడలో కొడాలి నాని గెలిచింది కాపు ఓట్లతోనేనని… వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని సవాల్ విసిరారు. కాగా సోమవారం ప్రెస్ మీట్‌లో చంద్రబాబు, లోకేశ్‌లను తిడుతూ కాపులను ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Latest Articles

నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్